Connect with us

Movies

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ కు తీవ్రగాయాలు

Published

on

మెగా కాంపౌండ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో రాణిస్తున్న మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. కొత్తగా కట్టిన కేబుల్ బ్రిడ్జిపై ఇసుక ఉండడం వాళ్ళ బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోవడంతో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మొదట దగ్గిరలో ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో వైద్యం అందించి తర్వాత అపోలో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకొని ఉండడం వలన పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. కాలర్‌ బోన్‌ విరిగిందని, వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని, ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.రు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected