Connect with us

Movies

NATS – మనసున్న మారాజు లేరనే వార్త జీర్ణించుకోలేనిది, కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం

Published

on

వెండితెరపై భక్తకన్నప్పగా మరిపించి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మనసున్న మారాజు కృష్ణంరాజు ఇక లేరనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఒక ప్రకటనలో తెలిపింది. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు తెలుగువారు ఎప్పటికి మరిచిపోలేరని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి పేర్కొన్నారు. తెలుగుజాతికి ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.

కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఉన్నత విలువలు ఉన్న వ్యక్తిగా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన రాజకీయ నాయకుడిగా కృష్ణంరాజు తెలుగువారికే ఓ స్ఫూర్తిలా నిలిచారని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి తెలిపారు. కృష్ణంరాజు కుటుంబానికి అమెరికాలో తెలుగు ప్రజల తరపున తమ ప్రగాఢ సానూభూతిని తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected