Connect with us

Schools

200 మంది పేద విద్యార్థులకు స్కూలు బ్యాగ్లు పంపిణీ: TANA Dallas Chapter

Published

on

ఆగస్టు 5, 2022, డాలస్: అమెరికాలోని పేద విద్యార్థులకు తానా మాజీ అధ్యక్షులు డా.నవనీత కృష్ణ ఆలోచన నుండి ప్రారంభమయిన తానా బ్యాక్‌ప్యాక్ వితరణ కార్యక్రమాన్ని డాలస్, టెక్సాస్ లో తానా డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ఆధ్వర్యాన, ప్రస్తుత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి సారథ్యంలో ఏర్పాటు చేశారు.

మన తెలుగువారెందరికో అమెరికా జీవనోపాధి కల్పించి, సొంత పౌరులుతో సమానంగా పనిచేయడంలో, మన ప్రవాసుల ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించి, మనకు ఎంతో ఇచ్చిన దేశానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రవాసంలో వున్న తెలుగు వారితో పాటు అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ పేదరికంలో వున్న వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పడానికి చాలా ఆనందంగా వుందన్నారు. ఇటువంటి సమాజసేవాకార్యక్రమాలు చేపట్టడానికి, తానా లాంటి స్వచ్చంద సంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు మరియు కార్యకర్తలకు తానా బృందం ధన్యవాదాలు తెలియజేశారు.

తానా డాలస్ లో స్థానిక యూలెస్ లోని H.E.B పాఠశాలలో 200 మందికి పైగా పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంటా నుంచి డాలాస్ కు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందని సతీష్ కొమ్మన తెలియజేశారు. తానా డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు తానా కార్యవర్గ బృందం సహకారంతో మీ ముందుకు వస్తామని, అందరు తానా నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

H.E.B ISD సూపరింటిండెంట్ డా. జో హ్యారింగ్టన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తానా వారు H.E.B ISD స్కూలు వారికి అందిస్తున్న సహాయాన్ని అభినందించి, H.E.B ISD ఫ్యామిలీస్ తరుపున ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా పూర్వాధ్యక్షులు డా. నవనీతకృష్ణ గారు ప్రారభించిన బ్యాక్ పాక్ కార్యక్రమం అమెరికా దేశం అంతటా మంచి ప్రజాదరణ పొందింది అన్నారు. అమెరికా మేము ఈ దేశంలో చాలా కాలం నుంచి నివశించడానికి అవకాశం కల్పించిందని, అటువంటి సదవకాశం కల్పించిన ఈ దేశ సమాజానికి తిరిగి ఇవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిందని, అలాగే తానా ఫౌండేషన్, తానా టీం స్క్వేర్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అమెరికా, ఇండియా లో చేపడుతుందని తెలియజేసారు. తానా వారికి ఈ అవకాసం ఇచ్చిన H.E.B ISD వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

తానా డాలాస్ టీం సతీష్ కొమ్మన, లోకేష్ నాయుడు కొణిదల, డా. ప్రసాద్ తోటకూర, శ్రీకాంత్ పోలవరపు, అశోక్ కొల్లా, మురళి వెన్నం మరియు స్థానిక తానా సభ్యులు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. తానా కోశాధికారి అశోక్ కొల్లా మాట్లాడుతూ, బ్యాక్ ప్యాక్ కార్యక్రమం డాల్లస్ తో పాటు , అమెరికా అంతట పలునగరాలలో కూడ చేపడుతున్నందుకు ఆనందంగా వుందని, ఇతువంటి మరిన్ని కార్యక్రమాలను తానా ద్వారా నిర్వహిస్తాం అని చెప్పారు. డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, తానా పూర్వాధ్యక్షులు డా. నవనీతకృష్ణ ప్రారంభించిన బ్యాక్ ప్యాక్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడం చాలా సంతోషం అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికి శుబాభినందనలు తెలియజేసి, ప్రతిసంవత్సరం ఈ కార్యక్రమం తానా ద్వారా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కార్యవర్గ బృందం శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, డా. ప్రసాద్ తోటకూర, చంద్ర పోలీస్, ప్రమోద్ నూతేటి, లెనిన్ వీరా, వెంకట్ బొమ్మ, దిలీప్, సుధీర్ చింతమనేని, పరమేష్ దేవినేని తదితరులు విరాళాలు అందించి, కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. తానా బాక్ ప్యాక్ కార్యక్రమం చేపట్టడానికి సహకరించిన H.E.B ISD ప్రతినిధులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు తానా డాలాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply