Connect with us

Education

రవి పొట్లూరి దాతృత్వంతో గుంటూరు జిల్లా విద్యార్థికి లాప్టాప్

Published

on

ఫిబ్రవరి 28 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆదరణ కార్యక్రమం ద్వారా రవి పొట్లూరి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లా, గరికపాడు గ్రామానికి చెందిన నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్ది వినోద్ కుమార్ విజ్ఞప్తికి ఫిలడెల్ఫియా వాసి రవి పొట్లూరి స్పందించారు. రవి పొట్లూరి ఇటు తానా అటు కర్నూల్ ఎన్నారై ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త లాప్టాప్ ని వెంటనే కోటేశ్వరరావు ద్వారా సోమవారం అందచేసారు. అదే విషయాన్ని విద్యార్ది వినోద్ కుమార్ నిర్ధారించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మట్లాడుతూ అడగ్గానే వెంటనే సహాయం చేసిన దాత రవి పొట్లూరి, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, ట్రస్టీ మరియు ఆదరణ సమన్వయకర్త రవి సామినేని లకు కృతజ్ఞతలు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected