Connect with us

Sports

ATA: 28 జట్లతో మొట్టమొదటి గోల్ఫ్‌ టోర్నమెంట్‌ విజయవంతం

Published

on

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ‘ఆటా’ ఆధ్వర్యంలో తొలి గోల్ఫ్‌ టోర్నమెంట్‌ను ఆగస్టు 28 న నిర్వహించారు. ఫ్లోరిడాలోని గైనెస్‌విల్లేలోని స్టోన్‌ వాల్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన ఈ టోర్నమెంట్‌లో సుమారు 28 జట్లు పాల్గొన్నాయి.

కిషోర్‌ చెన్పుపాటి, దినకర్‌ కుడుం, రిషి సుందరేశన్‌, సుండు వెంకటరమణి బృందం 58 టై బ్రేక్‌ స్కోర్‌తో ఫ్లెట్‌ 1 లో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చంద్ర ద్యామంగౌదర్‌, అనుప్‌ గుప్తా, సమీష్‌ చావ్లా, ప్రకాశ్‌ కృష్ణమూర్తి బృందం నిలిచింది. ఫ్లైట్‌ 2 లో కరణ్‌ చిలుకూరి, శశి రంగనాథన్‌, దురై నటరాజన్‌, వికాస్‌ కాలే బృందం 68 టై బ్రేక్ స్కోరుతో మొదటిస్థానంలో నిలిచారు. క్రిష్‌ రామయ్య కృష్ణమూర్తి, గోవింద్ జగన్నాథన్ ,సుందర్‌తో కూడిన బాలపెరుంబాల బృందానికి రెండవ స్థానం లభించింది. క్లోజెస్ట్‌ టూ ది పిన్‌ కెటగిరీలో హోల్‌-4 లో సుందు వెంకటరమణి, హోల్‌-12 లో సకీత్‌ వెంనూరి విజేతలుగా నిలిచారు. లాంగెస్ట్‌ డ్రైవ్స్‌ విభాగంలో విక్రం కల్లెపు(హోల్‌-6), చంద్ర ద్యామన్‌ గౌడ్‌ (హోల్-18 ) విజేతలుగా నిలిచారు.

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రెసిడెంట్ భువనేష్ బూజాలా మాట్లాడుతూ టోర్నమెంట్‌లో పాల్గోన్న బృందాలను అభినందించారు. సురేందర్ యెదుల్లా, ప్రసాద్ తుములూరి, రాజా శ్రీనివాసన్, విక్రమ్ కల్లెపు పర్యవేక్షణలో గోల్ఫ్ టోర్నమెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. 2022 జులై 1,2,3 తేదిల్లో వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే మహాసభలకు ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ డీసీ కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో-ఆర్డినేటర్ రవి చల్లా వాలంటీర్లను స్పాన్సర్‌లైన సోమిరెడ్డి లా సంస్థ, సురేష్ సరిబాల, సురేందర్ యెదుల్లా, విజయ్ ఖేతర్‌పాల్ , లూర్డ్స్ మెక్‌మైఖేల్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected