Connect with us

Sports

వన్డే మ్యాచ్ లో శ్రీలంకపై ఇండియా ఘన విజయం

Published

on

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ లో భాగంగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో శ్రీలంకపై ఇండియా గెలుపుతో బోణీ కొట్టింది. కుర్రాళ్లతో మంచి ఊపులో ఉన్న టీం ఇండియా కెప్టెన్‌ ధవన్‌ (86 నాటౌట్), ఇషాన్‌ (59) అర్ధసెంచరీలతో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఛేదనలో ఇండియా 36.4 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అరంగేట్ర ఆటగాడు పృథ్వీ షా (24 బంతుల్లో 9 ఫోర్లతో 43) దక్కించుకున్నాడు.

ధవన్‌ శ్రీలంకపై తక్కువ ఇన్నింగ్స్‌ (17) లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌ గా, అలాగే ఈ ఫార్మాట్‌లో 6వేల పరుగులు పూర్తి చేసిన పదో ఇండియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. బర్త్‌ డే రోజు వన్డే అరంగేట్రం చేసిన రెండో భారత క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌. గతంలో గురుశరణ్‌ సింగ్‌ (1990) ఈ ఫీట్‌ సాధించాడు. అలాగే వన్డే అరంగేట్రంలో వేగవంతమైన (33 బంతుల్లో) 50 పరుగులు చేసిన ఇషాన్‌ రెండో క్రికెటర్‌ అయ్యాడు. అంతేకాకుండా భారత్‌ తరఫున టీ20, వన్డే అరంగేట్రంలోనూ హాఫ్‌ సెంచరీతో రాబిన్‌ ఊతప్ప సరసన నిలిచాడు.

error: NRI2NRI.COM copyright content is protected