Connect with us

Associations

సోకాల్డ్ తానా పెద్దల కింగ్డమ్.. ఢాం ఢాం ఢాం కథ

Published

on

బ్యాటూ పోయి ప్రశ్నలు మిగిలే ఢాం ఢాం ఢాం!
ఉన్నదీ పోయి ఉంచుకున్నదీ పోయే ఢాం ఢాం ఢాం!
బీకామ్ లో ఫిజిక్స్ పోయి లెక్కలు వచ్చే ఢాం ఢాం ఢాం!
డాలర్ పోయి అరటిపండు వచ్చే ఢాం ఢాం ఢాం!
తెలుగు పోయి గ్రాంధికం వచ్చే ఢాం ఢాం ఢాం!
ఇదే సోకాల్డ్ తానా
పెద్దల కింగ్డమ్ ఢాం ఢాం ఢాం!!

కాన్ఫరెన్స్ పోయి అప్పులు వచ్చే ఢాం ఢాం ఢాం!
డబ్బులు పోయి రసీదులు రాకపోయే ఢాం ఢాం ఢాం!
ఫ్లైటు పోయి టికెట్ వచ్చే ఢాం ఢాం ఢాం!
బిల్డింగ్ పోయి మాటలు వచ్చే ఢాం ఢాం ఢాం!
మాటలు పోయి బూతులు వచ్చే ఢాం ఢాం ఢాం!
బూతులు పోయి కొట్టడం వచ్చే ఢాం ఢాం ఢాం!
ఇదే సోకాల్డ్ తానా పెద్దల కింగ్డమ్ ఢాం ఢాం ఢాం!!

ఎలక్షన్ పోయి సెలక్షన్ వచ్చే ఢాం ఢాం ఢాం!
పనిచేసేవాడు పోయి రుబ్బరుస్టాంప్ వచ్చే ఢాం ఢాం ఢాం!
సంస్థ పోయి వ్యక్తులు వచ్చే ఢాం ఢాం ఢాం!
నామినేషన్ పోయి ఎలిమినేషన్ వచ్చే ఢాం ఢాం ఢాం!
గెలవడం పోయి ఓడడం వచ్చే ఢాం ఢాం ఢాం!
ఇదే సోకాల్డ్ తానా
పెద్దల కింగ్డమ్ ఢాం ఢాం ఢాం!!

జవాబుదారీతనం పోయి పెట్టుబడిదారీతనం వచ్చే ఢాం ఢాం ఢాం!
పారదర్శకత పోయి దాపరికం వచ్చే ఢాం ఢాం ఢాం!
సేవాతత్వం పోయి వ్యాపార దృక్పధం వచ్చే ఢాం ఢాం ఢాం!
నిబధ్ధత
పోయి స్వప్రయోజనాలు వచ్చే ఢాం ఢాం ఢాం!
ప్రజాస్వామ్యం పోయి గుత్తాధిపత్యం
వచ్చే ఢాం ఢాం ఢాం!
ఇదే సోకాల్డ్ తానా పెద్దల కింగ్డమ్ ఢాం ఢాం ఢాం!!

సోకాల్డ్ తానా పెద్దల కథ కంచికి.. మనం ఇంటికి… ఢాం ఢాం ఢాం!!!

error: NRI2NRI.COM copyright content is protected