Connect with us

Events

కోలాహలంగా పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలు: ఎన్నారై జనసేన

Published

on

సెప్టెంబర్ 3వ తేదీన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు న్యూజెర్సిలో కోలాహలంగా జరిగాయి. సుమారు 700 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు హాజరైన ఈ వేడుకలలో మాస్కులు, శానిటైజింగ్ మరియు టెంపరేచర్ చెకింగ్ లాంటి జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి జనసైనికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో స్థానిక హిల్టన్ గార్డెన్ జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో కళకళలాడింది. పవన్ కళ్యాణ్ మైల్ స్టోన్ 50 వ పుట్టినరోజుని అమెరికా చరిత్రలో నిలిచిపోయే దిశగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించాల్సిందే.

జనసేన నాయకులు సత్య బొలిశెట్టి గారు, శివశంకర్ గారు మరియు శ్రీని మిర్యాల గారు జూమ్ ద్వారా జాయిన్ అయ్యి వారి సందేశాన్ని వినిపించారు. కొరియోగ్రాఫర్ మణి మరియు వారి టీం ప్రదర్శించిన నృత్యరూపకాలు గురించి ఎంత చెప్పినా తక్కువే, ముఖ్యంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ మరియు మగువా మగువా పాటలకు అద్భుతమైన ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే చిన్నారులు లావణ్య మరియు రమ్య నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. శ్రీనివాస్ ప్రసాద్ గారి పాటలు జనసైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపాయి.పెద్దల ఉపన్యాసాలు జనసైనికులను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.

రాబోయే ఎన్నికలకు ఎన్నారై జనసేన విధి విధానాలు, గ్రామ గ్రామానికి జనసేన, ఓటర్ ని ఆలోచింపజేసే పథకాలు, జనసేన గురించి విరివిరిగా ప్రచారాలు, సేవా కార్యక్రమాల పై కూలంకశంగా చర్చించారు. శేఖర్ పులిగారు, రవి వర్రె గారు ఒక్కొక్కరు జనసేన కోసం ఐదు వేల డాలర్ల విరాళాలు ప్రకటించడం జరిగింది. పెద్దలు డాక్టర్స్ శ్రీ సాయి కొల్ల గారు, శ్రీ నాగిరెడ్డి గారు అలాగే పెద్దలు శ్రీ ఉదయ్ భాస్కర్ కొట్టె గారు, శ్రీ సుబ్బు కోట గారు పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనడమే కాకుండా యువతకి దశ దిశ నిర్దేశం చేసారు. శేషు ఆకుల గారు వ్యాఖ్యానం ఎంతో చక్కగా, చక్కటి ఉచ్చారణతో సాగింది. ప్రతి స్టేట్ ఎన్నారై జనసేన జన సైనికులు తమ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.

మిర్చి రెస్టారెంట్ వారి నోరూరించే ఘుమఘుమలాడే వంటకాలతో రాత్రి భోజనం అటు జనసేన గురించి మాటలు మనసుని, ఇటు పసందైన వంటకాలు కడుపు పూర్తిగా నింపాయి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎటువంటి పొరపాటు లేకుండా నడపడమే కాకుండా, సన్మానాలు లాంటి వాటికి దూరంగా, ప్రతి కార్యక్రమంలో వెన్నుముకగా నిలిచిన నిరాడంబరులు మరియు వినయశీలురు అయిన శ్రీ స్వామి అనిశెట్టి గారికి మరియు సాయి నండూరి గారికి హృదయ పూర్వక అభినందనలు.

స్వాగత ద్వారం లో జనసేన నిలువెత్తు కటవుట్స్ అందరినీ ఆకర్షిస్తే, వేదికకు రెండువైపులా జనసేనాని బారి కటవుట్స్, సెంట్రల్ స్టేజ్ దగ్గర ఎల్.ఇ.డి మీద ప్రచారం చేసిన దృశ్యాలు జనసైనికులను కేరింతలు కొట్టించాయి. ఎ.బి.ఆర్ ప్రొడక్షన్స్ వారు మొత్తం కార్యక్రమాన్ని లైవ్ లో ప్రసారం చేశారు. అంతేకాకుండా వివిధ తెలుగు టీవీ చానెల్స్, 99 టీవీ లైవ్ లో ప్రసారం చేయడం జరిగింది.

న్యూజెర్సి ఎన్నారై జనసేన కీలక సభ్యులు సత్య వెజ్జు గారు, ఆనంద్ చిక్కాల గారు, సతీష్ మేకల గారు, శైలజ రంగిశెట్టి గారు, రమ ముత్యాల గారు, కేశవ్ అందె గారు, ఆనంద్ పాలూరి గారు ఇలా ఎందరో వెన్నంటి నిలిచి చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. టీం – హ్యూస్టన్, డల్లాస్, అట్లాంట, వర్జీనియా, డెట్రాయిట్, సియాటెల్ ఇలా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన జనసైనికులతో వేదిక కిక్కిరిసిపోయింది. నెవార్క్ ఎయిర్పోర్ట్, రహదారి అంతా జనసైనికులే. వివిద రాష్ట్రాల నుండి విచ్చేసిన జనసైనికులకు ఎయిర్ పోర్ట్ నుండి మొదలుకొని స్వాగత మర్యాదలకు ఎక్కడా లోటులేకుండా పూర్తిగా సఫలీకృతం అయ్యారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected