వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై వాడిగా కామెంట్స్ చేసారు. మహా న్యూస్ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువే లేదు అనే టాపిక్ పై మాట్లాడుతూ జనం ఖంగుతినే విషయాలను వెల్లడించారు. ఎంతవరకు నిజమోగాని మొన్న ఒక ఎమ్మెల్యేని జగన్ కొట్టాడని అంటున్నారన్నారు.
ఈ కొట్టడాలేంటండీ అంటూ న్యూస్ యాంకర్ నవ్వుతూ మరొక సంఘటనను గుర్తుచేయడం విశేషం. గతంలో ఒక చీఫ్ సెక్రటరీని కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టారు అని టాక్ నడిచిందని న్యూస్ యాంకర్ గుర్తు చేయగా, రఘురామకృష్ణంరాజు పోకిరి సినిమాలోని ప్రకాష్ రాజ్ డైలాగుని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా జగన్ కొట్టిన ఎమ్మెల్యే మరియు చీఫ్ సెక్రటరీ ఎవరై ఉంటారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికితోచిన పేరులు వారు చెప్తున్నారు. ముందుముందు ఎలక్షన్స్ టైంలో అన్న ఆ ఎమ్మెల్యేనో లేక ఆ చీఫ్ సెక్రటరీనో బయటకొచ్చి చెప్తారేమో చూడాలి.
You must be logged in to post a comment Login