Connect with us

Associations

తానాలో ప్రముఖంగా వినిపిస్తున్న ‘విమెన్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు గ్రహీత డాక్టర్ ఉమ కటికి ఆరమండ్ల

Published

on

తానా ఎలక్షన్స్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ‘విమెన్ ఆఫ్ ది డికేడ్’ అవార్డు గ్రహీత డాక్టర్ ఉమ కటికి ఆరమండ్ల. విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా పోటీ చేస్తున్న డాక్టర్ ఉమ గత ఎనిమిది వారాలుగా నిరంజన్ టీంతో కలిసి ఎలక్షన్ క్యాంపైన్ లో ఏమాత్రం తీసిపోకుండా పాల్గొనటమే కాకుండా తనకి మరియు టీం నిరంజన్ కి ఎందుకు వోట్ వేయాలో ఘంటాపథంగా చెప్తున్నారు. గత 10 సంవత్సరాల నుండి తను మహిళా సంక్షేమం కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు, తానాలో 50% సభ్యులైన మహిళలను మరిన్ని కార్యకలాపాల్లో భాగం చేస్తానని, తానాను మహిళా అభివృద్ధి వేదికగా మరలుస్తానని అంటున్నారు. వచ్చే తానా ఎన్నికల్లో మీ అందరి అమూల్యమైన ఓటును తనకు మరియు నిరంజన్ శృంగవరపు జట్టుకి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నారు. మరిన్ని వివరాలు క్రింద చూడవచ్చు.

విద్యా సాధనలు:-
Clinical Trails Management Certification, University of Chicago
Bioinformatics Certification, Stanford University
Ph.D., Andhra University
M.Phil., Andhra University
M.Sc., Andhra University

అలంకరించిన పదవులు:-

 • 2019-21 చైర్మన్, తానా మిడ్ వెస్ట్ ఉమెన్స్ ఫోరం.
 • 2019 కోఆర్డినేటర్, తానా మిడ్ వెస్ట్ ధీంతానా.
 • 2019 జాయింట్ సెక్రెటరీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్.
 • 2017-19 కోచైర్మన్, నేషనల్ ఉమెన్స్ ఫోరం.
 • 2018 ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్, చికాగో తెలుగు అసోసియేషన్.
 • 2017 కోర్ టీం, విమెన్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్.
 • 2016-18 కోఆర్డినేటర్, ఏపీఎన్ఆర్టీ చికాగో విభాగం.
 • 2016 17 వైస్ ప్రెసిడెంట్, చికాగో ఆంధ్రా అసోసియేషన్.
 • 2016 ఆర్గనైజర్, ఉమెన్స్ డే
 • 2015 డైరెక్టర్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో.

తానా ఆధ్వర్యంలో చేసిన సేవలు:-

 • చికాగోలో 2020లో జరిగిన ఫుడ్ డ్రైవ్ కు సహాయ సహకారాలు.
 • విజయవాడలో మే 2020లో కోవిడ్ సమయాన పేదలకు అన్నదానం.
 • విజయవాడలో సెప్టెంబర్ 2020 కరోనా సమయంలో పేదలకు అన్నదానం.
 • అరోరా పోలీసు సిబ్బందికి మే 2020 లో మాస్కుల పంపిణీ.
 • చికాగో బాలాజీ ఆలయ పూజారులకు మే 2020 లో మాస్కులు అందజేత.
 • నెల్లూరు వాత్సల్య అనాధాశ్రమంలో 8 మార్చి 2021న ఉమెన్స్ డే సందర్భంగా మాస్కులు, శానిటైజర్లు, శానిటరీ ప్యాడ్లు, హ్యాండ్ వాష్ ల పంపిణీ.

తానాలో నిర్వర్తించిన బాధ్యతలు:-

 • 7 మే 2020: మదర్స్ డే సందర్భంగా ‘అమ్మా నీకు వందనం’ కార్యక్రమం నిర్వహణతో ‘ఇండియన్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్’ ఖ్యాతి.
 • 16,17 మే 2020: ‘అమ్మా నీకు వందనం’ విభాగము నిర్వహణ.
 • 5, 8 జూన్ 2020: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘హగ్ మై ట్రీ’ నిర్వహణ.
 • 24 జూలై, 15 ఆగస్టు 2020: ప్రపంచ తెలుగు సాంస్కృతిక సభల ప్రధాన నిర్వాహకుల్లో ఒకరిగా ముఖ్య బాధ్యతల నిర్వహణ. భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులైన వెంకయ్య నాయుడు గారి నుంచి అభినందనల స్వీకరణ.
 • ఆగస్టు 2020: ప్రతినిధి, తానా పాఠశాల, చికాగో విభాగం
 • 28 నవంబర్ 2020: లక్కీ మహిళ కార్యక్రమం ముఖ్య బృంద సభ్యురాలు.

వరించిన అవార్డులు:

 • 7 మే 2020: మదర్స్ డే సందర్భంగా ‘అమ్మా నీకు వందనం’ కార్యక్రమం నిర్వహణతో ‘ఇండియన్ వరల్డ్ రికార్డ్’ అవార్డు.
 • 8 మార్చి 2021: దశాబ్దకాలంగా పురిటిగడ్డ పైనే కాకుండా ఉత్తర అమెరికాలోను సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను ప్రతిష్టాత్మక ‘నారీ: విమెన్ అఫ్ ది డికేడ్’ అవార్డు.

తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా ఆశయాలు:-
• ఎడ్యుకేట్ * ఎంపవర్ *ఎంకరేజ్
• తానా ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్‌గా నా బాధ్యతలన్నీ నెరవేర్చడం.
• సమాన ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి మరిన్ని కంపెనీలను ప్రోత్సహించడం.
• చిన్న తరహా వ్యాపారరంగంలో మహిళలను ప్రోత్సహించడం.
• యోగా, శ్రేయస్సు, సంస్కృతి మరియు విలువలపై మన తరువాతి తరానికి అవగాహన కల్పించడం.
• మహిళలకు అన్ని వయసుల వారిలో ఆరోగ్య అవగాహన పెంచడానికి వైద్య శిబిరాలు మరియు 5 కె వాక్ నిర్వహించడం.

Advertisement