Connect with us

People

ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, నాట్స్ పూర్వ అధ్యక్షులు మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు వేడుకలు

Published

on

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు వేడుకలు సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవడం గొప్ప విషయం. సాయంత్రం చంద్రమౌళి నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం ముందు తన అభిమానులు బాణసంచా కాలుస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు గజమాల మరియు పూల తలపాగాతో సత్కరించారు. కేక్ కట్ చేసి ఫోటోలు దిగుతుండగా ప్రాంగణమంతా బాణసంచా మరియు అభిమానులతో మార్మోగింది. అలాగే కళ్యాణి నగర్ లో అభిమానులు బైక్ ర్యాలీతో ఊరేగింపుగా తీసుకెళ్లి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. గత కొంత కాలంగా గుంటూరులోనే ఉంటూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మన్నవ, అమెరికాలో ప్రముఖ జాతీయ సేవా సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ పూర్వ అధ్యక్షులుగా సేవలందించిన తెలుగు బిడ్డగా అందరికీ సుపరిచితమే.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected