Connect with us

Donation

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, దుప్పట్లు, పండ్లు పంపిణి: తానా ఫౌండేషన్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ అధ్వర్యంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి సౌజన్యంతో పచ్చిమ గోదావరి జిల్లా రామశింగవరం గ్రామం నందు వృద్దులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, చలి దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పేదలకు, వృద్దులకు సేవ చేయడంలో తానా ఎప్పుడూ ముందు ఉంటుంది అని, తెలుగు ప్రజలకు సేవ చెయటానికి తానా ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ నాయకత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలని అమలుచేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో రామశింగారం గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected