Connect with us

Cultural

మొట్టమొదటిసారిగా ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద అంబరాన్నంటిన ‘తానా’ బతుకమ్మ సంబరాలు

Published

on

అక్టోబర్ 16న ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ‘తానా’ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వవేదిక పై మొట్టమొదటిసారిగా ఒక తెలుగు ఈవెంట్ అందునా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం తెలుగువారందరూ గర్వించదగిన విషయం. లార్జర్ దాన్ లైఫ్ రేంజిలో విశ్వనగరంలో ఏర్పాటుచేసిన 20 అడుగుల బంగారు బతుకమ్మ చరిత్ర పుటల్లో నిలుస్తుంది. ఇంత పెద్ద మెగా ఈవెంట్ ని అదేదో మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న చందంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం గొప్పవిషయం. బ్రూక్లిన్ బొరో ప్రెసిడెంట్ ఎరిక్ ఆడమ్స్ తరపున విచ్చేసిన రిప్రజెంటేటివ్ ప్రొక్లమేషన్ అందించడం తెలుగుగారికి దక్కిన గౌరవంగా భావించవచ్చు.

అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన ప్రసంగంలో చెప్పినట్లు క్రెడిట్ అంతా తానా గత అధ్యక్షులు జయ్ తాళ్లూరి అలాగే జయ్ నేతృత్వంలోని స్థానిక న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లోని లీడర్షిప్ సభ్యులకు చెందుతుంది. ముఖ్యంగా సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల, బోర్డు కోశాధికారి లక్ష్మి దేవినేని లను అభినందించాల్సిందే. టైమ్స్ స్క్వేర్ లో పర్మిషన్ దొరకడమే కష్టం అనుకునే పరిస్థితి నుండి అందరూ ఆహా ఓహో తెలుగు ఈవెంటుకి ఎంతటి గౌరవం అనుకునే స్థాయిలో నిర్వహించిన జయ్ తాళ్లూరి అండ్ టీంను, మొత్తంగా తానా కార్యనిర్వాహకవర్గాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాల వల్లనే మన తెలుగువాళ్ళ సత్తా ఏంటో అందరికీ తెలుస్తుంది. వన్ అండ్ ఓన్లీ తానా మహిళా ప్రెసిడెంట్ పద్మశ్రీ ముత్యాల, కళారాణి కాకర్ల, అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, కార్యదర్శి సతీష్ వేమూరి, మహిళా కార్యదర్శి ఉమా కటికి, ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట ఇంకా చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా హాజరవ్వడం మోటివేషనే.

నందమూరి బాలక్రిష్ణ నటించిన లారీ డ్రైవర్ సినిమాలోని దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా అంటూ సాగే పాటకి జయ్, అంజయ్య, నిరంజన్ తదితరులు కలిసి డాన్స్ చెయ్యడం ఆకట్టుకుంది. బతుకమ్మ పాటలకు డాన్సులు, గర్భా, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అబ్బురపరిచాయి. అమెరికన్స్ సైతం చేయి చేయి కలిపి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, జనకు జనకునింట్లో ఉయ్యాలో సత్య జనకునింట్లో ఉయ్యాలో అంటూ ఆడడం కనులవిందు చేసింది. అంతే కాకుండా అమెరికన్స్ తానా వారు ఏర్పాటుచేసిన 20 అడుగుల బతుకమ్మతో ఫోటోలు దిగుతూ కనిపించారు. మహిళలందరూ చక్కగా ముస్తాబై బతుకమ్మ పాటలకు ఆడుతుండగా ఆ చక్కని దృశ్యాలను ఆస్వాదించడం చుట్టూ గుమికూడిన న్యూయార్క్ వాసుల వంతైంది.

బతుకమ్మను చేసి తీసుకువచ్చిన ఆడపడుచులకు బహుమతులు, బెస్ట్ బతుకమ్మ చేసినవారికి పట్టు చీరలు బహుకరించారు. చివరిగా అందరికీ రుచికరమైన పండుగ భోజనం అందించడంతో ఆహుతులందరూ అభినందించారు. ఇంతటి చక్కని కార్యక్రమంలో అందరూ పాలుపంచుకునేలా న్యూయార్క్, న్యూజెర్సీ నుంచి రాను పోను బస్సులు ఏర్పాటుచేయడం విశేషం. మొత్తానికి ఎప్పటిలానే అమెరికాలో పెద్దన్న పాత్ర పోషించి తానా మిగతా తెలుగు సంఘాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పొచ్చు.

Advertisement
 
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply