శశికాంత్ వల్లేపల్లి మరోసారి తన వితరణ చాటుకున్నారు. గుడివాడ రోటరీ వైకుంఠ ప్రస్థానం భవన సముదాయం నిర్మాణానికి 25 లక్షల సాయం అందించారు. గత గురువారం మే 5 సాయంత్రం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ఈ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గుడివాడ రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ మలిరెడ్డి రవికుమార్ రెడ్డి అధ్యక్షతన ఒక సభ నిర్వహించారు. ఈ సభలో రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ అధ్యక్షులు బాబు శ్రీకర్ శశికాంత్ ను ఘనంగా సత్కరించారు. శ్రీకర్ మాట్లాడుతూ శశికాంత్ తండ్రి అన్న మాటను తనతో చెప్పగానే తక్షణమే ముందుకొచ్చిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రోటరీ వైకుంఠ ప్రస్థానం ప్రాజెక్ట్ లో భాగంగా సేవలు విస్తృతం చేసేందుకు తమ కుటుంబ సభ్యులు వల్లేపల్లి సీతారామ్మోహనరావు మరియు వల్లేపల్లి లక్ష్మి జ్ఞాపకార్ధం రాజదర్బార్ ఠాణా నిర్మాణానికి సహకరించి అందరికీ ఉపయోగపడేలా వాడుకలోకి తెచ్చే ప్రక్రియలో ముందున్న శశికాంత్ వల్లేపల్లి ని గుడివాడ వాసులు అభినందిస్తున్నారు.
You must be logged in to post a comment Login