Connect with us

News

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్ష పేరు మార్పు

Published

on

ఆంధ్రరాష్ట్రంలో పాత తరం, కొత్త తరం అనే తేడాలేకుండా అందరికీ తెలిసిన ఎంట్రన్స్ టెస్ట్ పేరు ఎంసెట్. ఎందుకంటే సాధారణంగా ప్రతి తల్లితండ్రులు తమ బిడ్డల్ని ఎంసెట్ పరీక్ష రాయించి, మంచి రాంకు వస్తే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ లో చేర్పించవచ్చని కోరిక. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ అంటే తెలియనివారు ఉండరు. కానీ ఇకనుంచి ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ (EAPCET – Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) ‎గా మార్చారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకి వెల్లడించారు. అలాగే ఎంసెట్ షెడ్యూల్‎ను విడుదల చేశారు. ఈనెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected