Connect with us

Movies

అట్లాంటాలో భీమ్లా నాయక్‌ పవర్ హంగామా

Published

on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌ ఈరోజే విడుదలై ఇటు ఓవర్సీస్ అటు ఇండియాలో అన్ని చోట్లా హిట్ టాక్ తో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ షో లో భాగంగా అట్లాంటా ఫ్యాన్స్ చేసిన హంగామా పవర్ఫుల్ గా ఉంది.

ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోలీసులను పెట్టి మరీ ప్రీమియర్స్ షో వెయ్యనివ్వకుండా మరియు కోర్ట్ స్టే కి విరుద్ధంగా టికెట్ రేట్లు తగ్గించి రెవిన్యూ సిబ్బంది ద్వారా కంట్రోల్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ హవాని ఆపలేకపోవడం విశేషం.

స్థానిక డిజీమ్యాక్స్ థియేటర్స్ ని ఒకరోజు ముందే బ్యానర్స్, కటౌట్స్ తో డెకరేట్ చేయడం దగ్గిరనుండి, ప్రీమియర్స్ షో కి ముందు తర్వాతా బాణసంచా కాల్చడం, కేక్ కటింగ్, జనసేన నినాదాలతో పవర్ హంగామా చేసారు అభిమానులు. ఇదంతా అట్లాంట అభిమానుల అండదండలే, వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు నిర్వాహకులు.

భీమ్లా నాయక్‌ అట్లాంట ప్రీమియర్స్ షో విశేషాలు: భారీ ఎత్తున లక్ష క్రాకర్స్ బాణసంచా కాల్చడం, దీనికి 1100 డాలర్లు స్పాన్సర్ చేసిన వెంకట్ ఐనాబత్తిన. రాస్వెల్ సిటీ కౌన్సిల్ నుండి క్రిస్టీన్ హాల్ ముఖ్య అతిదిగా విచ్చేసి అభిమానుల సమక్షంలో సినిమా చూడడం, అర్చనా రెడ్డి కాశీ కండువాతో క్రిస్టీన్ ని సత్కరించడం. డిజిమేక్స్ ధియేటర్ ముందు హమ్మర్ వాహనం పై తొమ్మిది అడుగుల నిలువెత్తు కటవుట్. హాట్ బ్రెడ్స్ వారు ఎంతో అభిమానంతో ముందుకు వచ్చి ఫుల్ షీట్ కేక్ స్పాన్సర్ చెయ్యడం.

150 భీమ్లా నాయక్‌ టీ షర్ట్స్ మరియు 100 కాశీ టవల్స్ అభిమానులకు అందజేయడం. దీనికి రుక్మిణి కోట, గోపాల్ గూడపాటి మరియు నాగు కూనసాని సహకారణ. సుమారు 300 డాలర్ల విలువ చేసే కంఫెటీస్ ధియేటర్స్ లో పేల్చి, సిల్వర్ స్క్రీన్ ముందు అభిమానుల డాన్స్. దక్కన్ స్పైస్ రెస్టారెంట్ వారు స్నాక్స్ స్పాన్సర్ చెయ్యడం. అభిమానులు ప్రత్యేకించి వేయించుకొన్న బ్యానర్స్.

పవన్ కల్యాణ్ ప్రతీ సినిమాకి వారం ముందు నుండి డైలి క్విజ్ పెట్టడం అనవాయితీ. సుమారు 8 మంది విజేతలకు గిఫ్ట్ కార్డ్స్ అందజేత. ప్రైం9 టీవి చానెల్ వారు అట్లాంటా ప్రీమియర్ హంగామాని లైవ్ ప్రసారం చెయ్యడం, దీనికి సహకరణ వర్మ. డప్పుల మోతతో హోరెత్తించిన పవన్ కళ్యణ్ అభిమానులు. ఏక్ మార్, దో మార్ అండ్ తీన్ మార్ అంటూ డప్పుల చప్పుళ్ళతో చిన్నారుల డాన్స్, దీనికి సారద్యం వహించిన మహేష్ కొప్పు.

ప్రీమియర్స్ షో హంగామా స్పాన్సర్స్: కరోతు సురేష్, రవి యెలిశెట్టి, రాఘవ బోగాది, వెంకట్ కృష్ణ మర్రిఊడి, కృష్ణ మేకల, వెంకట్ ఐనాబత్తిన (విన్నీ రావ్), మహా రాణా, సాయిరాం కారుమంచి, నాగ పునీత్ చందు, వెంకట్ చెన్నుబొట్ల, హేమంత్ పెనుమత్స, అర్చన రెడ్డి, వెంకట్ జిడుగు, చిన్మయ మంచాల, వెంకట్ గోక్యాడ, మని జోగరావ్ చీకరమెళ్ళి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected