Connect with us

Entertainment

‘సారంగ దరియా’ పాట పాడిన కొరియా యువతికి తెలుగువారు ఫిదా

Published

on

నమస్తే నేను కొరియా వాసిని. ఈరోజు నేను మీకోసం తెలుగు పాట ‘సారంగ దరియా’ పాడతాను అంటూ మొదలుపెట్టి లవ్‌స్టోరీ సినిమాలో మంగ్లి పాడిన ‘సారంగ దరియా’ పాటను అందుకోవడం చూసి తెలుగువారు ఫిదా అవుతున్నారు. మామూలుగానే నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన సినిమాలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు కొరియా యువతి తెలుగు యాసను సైతం అందుకొని పాడడంతో ఈ పాటకి ఇంకా క్రేజ్ పెరిగింది. సంగీతానికి ఎల్లలు లేవంటే ఇదేనేమో. హిందీలో మాట్లాడుతూ నాకు సంతోషంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మాట్లాడడం చూస్తుంటే తనకు హిందీలో కూడా కొంచెం ప్రావీణ్యం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply