Connect with us

Literary

న్యూయార్క్ లో జొన్నవిత్తుల తెలుగు సాహితీ వైభవం – Telugu Literary and Cultural Association

Published

on

తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ వారు న్యూయార్కులో తెలుగు సాహితీ వైభవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రముఖ తెలుగు కవి మరియు ప్రముఖ సినీ గేయ రచయిత అయినటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఈ సాహితీ వైభవం కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ ఆదివారం జూన్ 5న సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు నిర్వహించే ఈ సాహితీ ప్రియుల కార్యక్రమంలో తెలుగు సాహిత్యం, తెలుగు పేరడీ, ఇష్టా గోష్ఠి వంటి అంశాలపై జొన్నవిత్తుల పదునైన సాహిత్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేయనున్నారు.

న్యూయార్కులోని స్థానిక ఫ్లోరల్ పార్క్ లో నిర్వహిస్తున్న ఈ సాహితీ కార్యక్రమంలో తేనీటి ఫలహారాలు అందించబడును. న్యూయార్క్, న్యూ జెర్సీ మరియు కనెక్టికట్ ప్రాంతాలలోని సాహితీ ప్రియులు అందరూ పాల్గొని ఆస్వాదించవలసిందిగా తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గ సభులు మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply