Connect with us

Education

తానా తెలుగు పరివ్యాప్తి కమిటీ ఆధ్వర్యంలో ‘తెలుగు తేజం భాషా పటిమ పోటీలు’

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ తెలుగు భాషా సాహిత్యం మరియు పరివ్యాప్తి పై చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులు తెలుగు చదవటం, రాయటం ఒక ఆటలాగ తేలికగా నేర్చుకోవాలి అని, అలాగే తెలుగు భాషపై మక్కువ, పటిష్ఠత మరియు అభిరుచి పెంచడం కోసం ‘తానా – తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో ‘తెలుగు తేజం పోటీలు’ నిర్వహిస్తున్నారు.

ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్న పిల్లలు మినహా, ప్రవాస దేశాలలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చును. తల్లితండ్రులు మీ పిల్లలను ప్రోత్సహించి ఈ పోటీలలో భాగస్వాములు చేయవలసిందిగా తానా వారు కోరుతున్నారు. దరఖాస్తు, ప్రవేశ రుసుము మరియు నియమ నిబంధనల కోసం ఈ NRI2NRI.COM లంకెను క్లిక్ చేయండి.

నియమ నిబంధనలు:

  • 1. కిశోర విభాగం: 5 – 10 ఏళ్ల వయసు. 2. కౌమార విభాగం: 11 – 14 ఏళ్ల వయసు. 3. కౌశల విభాగం: 15 – 18 ఏళ్ల వయసు. ఇలా మూడు వయో వర్గాల వారికి, వారి అవగాహన, గ్రహణ శక్తిని బట్టి పోటీలు జరుగుతాయి.
  • తమ భాషా పరిజ్ఞానాన్ని బట్టి ఎవరైనా తమ వయసు కంటే పై విభాగం పోటీలలో పాల్గొన వచ్చు. కింది విభాగం పోటీలలో పాల్గొనడానికి అనర్హులు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – తెలుగు రాష్ట్రాలలో నివసిస్తున్న పిల్లలు మాత్రం ఈ పోటీలలో పాల్గొనరాదు. ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, తెలుగు భాషపై మక్కువ గల ఎవరైనా పోటీలలో పాల్గొనవచ్చు.
  • ప్రవేశ రుసుము చెల్లించటానికి చివరి తేదీ మే 1, 2022. ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారే పోటీకి అర్హులు.
  • జూన్ 4, 5 తేదీలలో పోటీల నిర్వహణ.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected