Connect with us

Health

ఒత్తిడులను అధిగమించేలా డాలస్ లో తానా యోగా శిక్షణ: Train like a Himalayan Yogi

Published

on

డాలస్ లో తానా ఆధ్వర్యంలో ఆగస్టు 7న ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ యోగా శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా, ఆర్ధిక మాంధ్యంలో కొట్టిమిట్టాడుతున్న తరుణంలో ప్రవాసంలో వున్న తెలుగువారి కోసం, ప్రస్తుత్తం వున్న ఒత్తిడులను అధిగమించడానికి, ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడంలో యోగా కార్యక్రమం దోహదపడుతుందని, తానా బృందం సహాయ సహకారాలతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది అని చెప్పారు. యోగా వలన ఆరోగ్యంతో పాటు, మనోధైర్యం, రోగనిరోధక శక్తి వంటి పలుప్రయోజనాలు వున్నాయని తెలియజేసి, యోగా గురువు ‘చుక్కపల్లి కిరణ్’ గారిని డాలస్ తీసుకురావడంలో సహాయ సహకారాలు అందించిన సుబ్బరాయ చౌదరి గారికి ధన్యవాదాలు తెలిపి, ‘చుక్కపల్లి’ గారిని వేదిక మీదికి ఆహ్వానించారు.

‘కిరణ్ చుక్కపల్లి’ గారు యోగా అంటే ఎమిటి, ఎలా మనతరం వారికి వచ్చింది అని చెప్తూ … గత 1400-1500 సంవత్సరాల క్రితం ఎందరో మన భారత దేశంపై దండయాత్ర, పరిపాలన సాగించినా, ఇప్పటికీ మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ఋషులు, గురువులు ఈ యోగా అర్ట్ ఫాం ను సంరక్షిస్తూ, గుప్తంగా సాధన చేసి మన తరతరాలకు అందేలా చేశారు. అదృష్టవశాత్తు గురు పరంపర వలన నాకు హిమాలయాల్లో గురువుల సహకారంతో నేర్చుకునే అవకాశం కలగడం, గురు మండల నుంచి మంచి గురువు దీవెనతో నేర్చుకోగలగడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ యోగా ప్రక్రియ చాలా క్లిష్టమైనది అని, గురువు గారు సమక్షంలో ముందుగా సరియైన పద్దతి లో నేర్చుకుంటే మంచి సత్ఫలితాలు వుంటాయని చెప్పారు. మీరు చేస్తున్న యోగా ప్రక్రియ సరిగా చెయ్యక పోతే ఎన్నటికీ పూర్తి చేయలేరని, అందుకే అన్నీ తెలిసిన మంచి గురువు దొరకడం అదృష్టం అన్నారు.

నన్ను చాలా మంది వెస్టరన్ వారు మీరు ఏరకమైన యోగి, హఠ యోగా లేక అష్టాంగ యోగా అని ప్రశ్నించేవారని, కాని దానికి సమాధానం చాలా క్లిష్టమైనదని అన్నారు. నిజానికి హఠ యోగి కావాలంటే అంత సులువు కాదని, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇంద్రియాలు, ఊపిరిపై 8 రకాలైన నియంత్రణ వుండాలి, అటువంటి నియంత్రణను ప్రదర్శించిన వారిలో సాయిబాబా, రమణ మహర్షి, స్వామి రామ వంటి వారు అని, ఈ ఆధునిక చరిత్రలో అలాంటి పట్టు సాధించిన వారు అరుదు అని అన్నారు. హఠ యోగ చాలా క్లిష్ట మైనదని, దానికి సరళీకృతమైన సంస్కరణ అయిన ‘అష్టాంగ యోగ’ ను పతాంజలి మహర్షి మనకు అందించారు. అన్ని గ్రంథాల సారం స్థిరం, సుఖం, ఆసనం అని, యోగా ద్వారా ఇది సాధ్యం అవుతుందని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. తరువాత మేము ఈ యోగా ప్రక్రియను 7 మండలాలుగా రూపొందించాము అని… విన్యాస ఆసనాలను (అధర్ముఖ), శ్వాస ప్రక్రియ మెళుకువలను అందరికీ నేర్పించారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ ‘చుక్కపల్లి కిరణ్’ గారికి తానాతో మంచి అనుభందం వుందని, వారు ఇండియాలో థింక్ పీస్ తో అరకు ప్రాంతంలోని గిరిజన ప్రజలకు చేస్తున్న సేవ చాలా గొప్పది అని చెప్పారు. కిరణ్ గారు ఈరోజు తానాతో యోగా కార్యక్రమం చేపట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి ముందు ముందు కూడ వారు గిరిజన ప్రాంతంలో చేస్తున్న సేవలో తానా చేయూతనిస్తుందని తెలిపారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మరియు తానా కార్యవర్గ బృందం ‘కిరణ్ చుక్కపల్లి’ గారిని పుష్పగుచ్చం, దుశ్శాలువ మరియు సన్మాన పత్రికతో ఘనంగా సత్కరించారు. ‘కిరణ్ చుక్కపల్లి’ గారు, తానా వారికి ధన్యావాదాలు తెలియజేసి, ప్రత్యేకంగా రాజేష్ అడుసుమిల్లి గారు నేను ముందుగా అమెరికా రావడానికి సహకారం అందిచారని కృతజ్ఞతలు తెలిపారు. తరువాత కొప్పెల్ హైస్కూల్ విద్యార్ధులు థింక్ పీస్ సంస్థతో కలసి పనిచేస్తున్న విద్యార్ధులను సభకు పరిచెయం చేసి, ఇంతచిన్న వయసులో వారు చేస్తున్న సామాజిక అభినందించారు.

డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, కమ్మ్యూనిటీ ఎట్ లార్జ్ సభ్యులు లోకేష్ నాయుడు, ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, కోశాధికారి అశోక్ కొల్లా, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, వెంకట్ బొమ్మ, దిలీప్, లక్ష్మి పాలేటి, దీప్తి సూర్యదేవర, రాజేష్ చుక్కపల్లి మరియు తానా డాలాస్ టీం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారు అట్లాంటా నుంచి డాలస్ రావడం ఆనందదాయకం అని, వారిని పుష్పగుచ్చం, దుశ్శాలువతో సత్కరించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఇలా డాలస్ టీం అందరితో కలసి ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా వుందని, తానా టీం అందరు కలసి వన్ టీం లా చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కార్యవర్గ బృందం శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, రాజేష్ అడుసుమిల్లి, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, వెంకట్ బొమ్మ, దిలీప్, సుధీర్ చింతమనేని, లక్ష్మి పాలేటి, దీప్తి సూర్యదేవర, రాజేష్ చుక్కపల్లి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ కార్యక్రమం చేపట్టడానికి సహకరించిన వివిధ ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు తానా డాలాస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కృతఙ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply