భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ ప్రవాస తెలుగు సంఘాలన్నీ ఏకమై భారత ప్రధాన న్యాయమూర్తి ని జూన్ 24 శుక్రవారం నాడు న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని మిరాజ్ బాంక్వెట్ హాల్ లో ఘనంగా సన్మానించనున్నారు.
ఈ కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా గత బుధవారం న్యూ జెర్సీ నార్త్ బ్రున్స్విక్ లోని బిర్యానీ జంక్షన్ రెస్టారంట్ లో తెలుగు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ప్రముఖ ఎన్నారై బ్రహ్మాజీ వలివేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్న నాయకులంతా జస్టిస్ నూతలపాటి వెంకట రమణను సన్మానించడం ప్రతి తెలుగు వారు తమ భాద్యతగా భావించి కారక్రమానికి హాజరై దిగ్విజయం చేయాలని కోరారు.
అన్ని తెలుగు సంఘాలు ఒకే వేదిక మీద నుంచి ఘనకీర్తి సాధించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ నూతలపాటి వెంకట రమణను సన్మానించడం అరుదైన కార్యక్రమమని, అందరం కలిసికట్టుగా కార్యక్రమ జయప్రదానికి కృషి చేస్తామని తెలిపారు.
You must be logged in to post a comment Login