ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. శనివారం మే 14 న ఘనంగా నిర్వహించనున్న ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిధిగా శాన్ఫ్రాన్సిస్కో ఇండియా కాన్సులేట్ జనరల్ డాక్టర్ టి.వి. నాగేంద్ర ప్రసాద్ హాజరవనున్నారు.
టాలీవుడ్ గాయనీ గాయకులు సుమంగళి మరియు వేణు శ్రీరంగం మ్యూజికల్ హిట్స్ తో అందరినీ అలరించనున్నారు. స్థానిక యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర సెంటర్ లో జరగనున్న ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ లో మంచి ఫుడ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ఎంట్రీ ఉచితం. కానీ లిమిటెడ్ టికెట్స్ ఉండడం వల్ల రెజిస్ట్రేషన్ తప్పనిసరి. కావున త్వరగా https://www.eventbrite.com/e/326276510827 లో మీ పేరు నమోదు చేసుకోండి.మరిన్ని వివరాలకు క్రింది ఫ్లయర్ ని చూడండి.
You must be logged in to post a comment Login