Connect with us

Associations

టెన్నెస్సీ తెలుగు సమితి ఉగాది సెలబ్రేషన్స్

Published

on

ఎవరి పేరు చెబితే తెలుగు సినీ కోయిల రాగం అందుకుంటుందో!
ఎవరి పేరు చెబితే అవార్డ్స్ పరిగెత్తుకుంటూ వస్తాయో!!
ఎవరి పేరు చెబితే వాయిస్ ఓవర్ కోసం దుబ్బింగ్ థియేటర్స్ మూగబోతాయో!!!
ఏంటి ఈ హడావిడి అంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? ఐతే మీరు టెన్నెస్సీ తెలుగు సమితి ఉగాది సెలబ్రేషన్స్ వైపు ఒక లుక్కు వేయాల్సిందే. ఒక జాతీయ అవార్డు, రెండు ఫిలింఫేర్ అవార్డులు, తొమ్మిది నంది అవార్డుల గ్రహీత మరియు 750 సినిమాలకి పైగా డబ్బింగ్ చెప్పిన మన గాయని సునీత గారు ఏప్రిల్ 7న నాష్విల్ లోని ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో టెన్నెస్సీ తెలుగు సమితి వారు నిర్వహిస్తున్న ఉగాది సంబరాలకు వేంచేస్తున్నారహో. అలాగే సూపర్ సింగర్ ఫేమ్ గాయకులు దినకర్ విళంబి నామ తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి మీ ముందుకు రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ దీపక్ రెడ్డి గారు సమర్పకులుగా వ్యవహరించగా ఆడియో మరియు లైటింగ్ డీజే శ్రీనివాస్ దుర్గం గారు అందిస్తున్నారు. టికెట్స్ కొరకు http://www.tennesseetelugu.org/ సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected