Connect with us

Events

Kuwait NRI TDP సభ్యత్వ నమోదును విజయవంతం చేసే దిశగా ప్రణాళిక

Published

on

2024 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టే దిశగా, ఇప్పట్నుంచి అడుగులు వేయాలని యన్ ఆర్. ఐ. టిడిపి గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ, మరియు గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ వెంకట్ కోడూరి మరియు బలరాం నాయిడు దరూరి, నాగేంద్ర బాబు సూచన మేరకు, యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్, యన్.ఆర్.ఐ. లతో బలమైన క్యాడర్‌ను తయారు చేసేందుకు వ్యూహాలు రెడీ చేస్తుంది.

పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమము మొదట విడతలో కోవిడ్ నిబందనలకు అనుకూలంగా కొన్ని ప్రాంతాలలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం విజయవంతంగా చేయగలిగాము, రెండో విడతలో మిగతా ప్రాంతాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమము కొనసాగిస్తాము, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచేందుకుగాను ప్రత్యేకంగా ఒక టీమును రూపొందించాము. నిజాయితీగల రాజకీయాలతో పటిష్టమైన పౌర సమాజాన్ని నిర్మించేందుకు యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ కట్టుబడి ఉందని “గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ వెంకట్ కోడూరి” తన ప్రసంగంలో తెలిపారు.

పార్టీని కొత్త రక్తంతో నింపాలని, కొత్త వారికి ఆహ్వానం పలకాలని యన్ ఆర్ ఐ తెలుగుదేశం కువైట్ నడుము బిగించింది. ఇప్పటినుంచే దీనికి తగ్గట్టుగా అడుగులు కూడా వేస్తోంది. దేశంలో ఏ పార్టీకీ లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకే సొంతం. కాబట్టి, కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసినందునే పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో వేగవంతం చేసి, రికార్డులను సృష్టించి పసుపుదళానికి తిరుగేలేదని చేసి చూపిస్తాము అని అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు తెలియచేసారు.

పార్టీకి కార్యకర్తలే పట్టు గొమ్మలని పార్టీలో చేరిన వారికి తప్పనిసరిగా ఆదరణ ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ప్రతి ఒక్కరు పార్టీ సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు అని “యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్“ ప్రధాన కార్యదర్శి మల్లి మరొతు తన ప్రసంగంలో తెలియచేసారు.


ఈ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యనాయకులు, యనిగల బాలకృష్ణ గారు , మల్లి మరాతు, రాణి చౌదరి, నారాయణమ్మ, మోహన్ రాచూరి, శ్రీనివాస రాజు, చిన్నన్న రామకృష్ణ, రెడ్డియ్య చౌదరి, షేక్ యం డి. అర్షద్, మురళి దుగ్గినేనీ, విజయ కుమార్ పసుపులేటి, కొల్లపనేని రమేష్, రామకృష్ణ కాటూరి, శివప్రసాద్ గౌడ్, ఆవుల చిన్నయ్య యాదవ్, గుండయ్య నాయుడు శివకుమార్ గౌడ్, మల్లిశెట్టి రవి, నూసెటి సుబ్బానరసింహులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected