Connect with us

Associations

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఉగాది వేడుకలు

Published

on

ఇందుమూలంగా యావనమందికి తెలియజేయునది ఏమనగా 44 సంవత్సరాల బృహత్తర అనుభవ సంస్థ మన బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఉగాది వేడుకలు వచ్చే నెల ఏప్రిల్ 7న స్టోన్ బ్రిడ్జ్ ఉన్నత పాఠశాలలో సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహిస్తున్నారహో! తెలుగు సినీ తార అనిషా ఆంబ్రోస్, వ్యాఖ్యాత అశ్విని శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి మిమిక్రీ కళాకారులు శివా రెడ్డి, పంచాంగ శ్రవణం, షడ్రుచుల ఉగాది పచ్చడి, ఇంద్రజాలం ప్రదర్శన, కుర్రకారు ప్రతిభా ప్రదర్శన, మరెన్నో స్థానిక సాంస్కృతిక కార్యమాలతో ఉగాది సంబరాలను మీ ముందుకు తెస్తున్నారహో! కావున తామెల్లరూ కుటుంబ సమేతంగా విచ్చేసి చక్కని విందు, మనసు మురిసే వినోద కార్యక్రమాలను ఆస్వాదించవలసిందిగా కోరుతున్నామహో! టికెట్స్ కొరకు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ను సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected