Connect with us

Convention

ముమ్మరంగా ‘ఆటా’ 17వ మహాసభల ఏర్పాట్లు, ముస్తాబవుతున్న కన్వెన్షన్ సెంటర్

Published

on

. ముస్తాబవుతున్న వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్
. 15 వేల మందికి పైగా ఏర్పాట్లు
. ఎనభై కి పైగా కమిటీల రేయింబగళ్ల శ్రమ
. పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
. ఆధ్యాత్మిక, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల తాకిడి
. మేరీల్యాండ్, వర్జీనియా నుంచి షటిల్ సర్వీస్

ఆటా పదిహేడవ మహాసభలని న భూతో న భవిష్యతి అన్న విధంగా, వందలమంది కళాకారులతో అమెరికా రాజధాని ప్రాంతమైన వాషింగ్టన్ డి. సి లో రెండు లక్షల చదరపు అడుగుల సువిశాలమైన, అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ లో అట్టహాసంగా ప్రారంభించడానికి సన్నాహాలు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎనభై కి పైగా కమిటీలు రేయింబగళ్లు కష్టపడుతున్నారు.

ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్దినేటర్ కిరణ్ పాశం, కో-హోస్ట్ కాట్స్ అధ్యక్షులు సతీష్ వడ్డీ మరియు ఇతర కీలక సభ్యులు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే (డోనార్స్) అతిధులకు కోసం రవాణా, భోజన, హోటల్ వసతి ఏర్పాట్లు చేయడానికి ఒక సైన్యం రెడీ అవుతుంది. ఎప్పుడులేనివిధంగా ఈసారి మేరీల్యాండ్, వర్జీనియా నుంచి వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వరకు షటిల్ సర్వీసెస్ ఏర్పాటుచేస్తున్నారు.

Bhuvanesh Boojala
President

ఆటా మహాసభలకు మొట్టమొదటి సారిగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) గారికి స్వాగతం చెప్పడానికి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. “Daaji” కమలేష్ D.పటేల్ గారి ప్రసంగం కోసం తెలుగు వాళ్ళతో పాటు ఇతరులకు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మనం అందరం ఎంతో ఆరాధించె, ప్రేమించే, గౌరవించే ప్రముఖ కవులు, ప్రముఖ సినీ కళాకారులు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, Cricket Legends కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మరియు టి-20 , వన్ డే క్రికెట్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి కళ్ళు జిగేల్ మనిపించే క్రిస్ గేల్ ని కలవడానికి, వారితో సంభాషించడానికి ఎంతో ఉత్సుకతో వున్నారు.

Sudheer Bandaru
Convener

“మ్యాస్ట్రో” “పద్మవిభూషణ్” ఇళయరాజా సంగీత విభావరి , “Melody King” సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్, భీమ్లా నాయక్, డి జె టిల్లు తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంపాదించి, సంచలనం సృష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల అండ్ బ్యాండ్ కోసం ఎంత సేపైనా వేచివుంటామన్న సంగీత ప్రియులు మరి ఇన్ని ప్రత్యేకతలతో, ఇంతమంది ఆటా సైనికులతో పదిహేను వేల మంది సమక్షం లో జులై ఒకటి, రెండు, మూడు తేదీలలో జరుపుకోబోయే ఆటా మహాసభలకు మీరందరు విచ్చేసి, ఆతిధ్యం స్వీకరించి, ఆనందించి, ఆశీర్వదించి, ఆటా అంటే అమెరికాలోని తెలుగు వారందరిదని, ఈ ఆటా 17వ మహాసభలు చరిత్ర లో నిలిచిపోయే విధంగా జరుగబోతుంది.

Kiran Reddy Pasham
Coordinator

అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో ఆట ఉత్సవాలను దిగ్విజయం చేయటానికి PROMO CODE: CATS ద్వారా $20 డిస్కౌంట్ జూలై 2,3 రోజులకు టికెట్స్ కు సహకారం ప్రకటించారు. అందరూ ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించికొని అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో ఆటా 17వ మహాసభలు విజయవంతం చేయాలని కోరుతున్నారు. టికెట్స్ డిస్కౌంట్ www.ataconference.org/buy-tickets లో లభించును. మరిన్ని వివరాలకు www.ataconference.org సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected