Connect with us

Celebrations

మే 27న ర్యాలీలో ధృవతార ఎన్టీఆర్ సెంటెన్నియల్ సెలబ్రేషన్స్

Published

on

ఎన్టీఆర్! ఈ మూడు అక్షరాలు వినగానే ప్రతి తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాలైతేనేం, రాజకీయాలైతేనేం ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రాముడు ఎన్టీఆర్.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాల్లో తెలుగునాట ఒక సంచలనం సృష్టించారు. అటువంటి దేశోద్ధారకుడు వచ్చే నెల మే 28న 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ శుభసందర్భంగా ఆ తారకరాముని అభిమానులు అమెరికాలోని నార్త్ కెరొలినా రాష్ట్రం, ర్యాలీ నగరంలో మే 27 శుక్రవారం రోజున పెద్ద ఎత్తున అన్నగారి శతజయంతి ఉత్సవం నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. అందరికీ ఏర్పాట్లు ఘనంగా చేసేందుకు వీలుగా మీ పేరు https://www.signupgenius.com/go/10C0E49ACAB2AA1FEC07-ntr100 లో నమోదు చేసుకోండి అంటున్నారు నిర్వాహకులు.

https://youtube.com/shorts/0TsCpbEsc7w?feature=share

Advertisement
 
 
 
 
 
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply