Connect with us

Associations

మీట్ & గ్రీట్ విత్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘టిటిఎ’ బోస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి తో మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వెస్ట్బొరో లోని స్థానిక మయూరి రెస్టారెంట్లో గత మంగళవారం ఆగష్టు 24న నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు మరియు లోకల్ లీడర్షిప్ హాజరయ్యారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ గత అధ్యక్షులు మోహన్ నన్నపనేని పాల్గొన్నవారిలో ఉన్నారు . టిటిఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కర్రా మల్లా రెడ్డి, డాక్టర్ జంద్యం దివాకర్ మరియు ప్రాంతీయ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఈ మీట్ & గ్రీట్ విత్ టి.టి.ఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి కార్యక్రమాన్ని పకడ్బందీగా ఏర్పాటుచేశారు. వీక్ డే అయినప్పటికీ ఎక్కువమంది పాల్గొనడం విశేషం. వంశీ రెడ్డి అందరితో కలియతిరిగి అందరిలో ఒకరిలా కలిసిపోయారు. చివరిగా విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply